Abn logo
Sep 21 2021 @ 11:03AM

టీడీపీ మహిళా నేత ఇంటిపై వైసీపీ శ్రేణుల దాడి

గుంటూరు జిల్లా: ఏపీ హోంమంత్రి సొంత నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులు బీభత్సం సృష్టించారు. పెదనందిపాడు మండలం, కొప్పర్రులో టీడీపీ మాజీ జడ్పీటీసీ శారద ఇంటిపై వైసీపీ కార్యకర్తలు దాడికి దిగారు. ఇంటికి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో ఆరు బైకులు దగ్ధమయ్యాయి. వైసీపీ దాడితో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు. గ్రామంలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియక గ్రామస్తులందరూ బిక్కు బిక్కుమంటూ ఇళ్లల్లోనే ఉంటున్నారు.


గణేష్ నిమజ్జనం సందర్భంగా గత రాత్రి శారద ఇంటిపై ఒక పథకం ప్రకారం వైసీపీ కార్యకర్తలు దాడి చేసి, ఇంటిని తగలబెట్టారు. అడ్డు వచ్చిన టీడీపీ కార్యకర్తలు, గ్రామస్తులపై విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు. పోలీసులు ఉన్నప్పటికీ వైసీపీ శ్రేణులు రెచ్చిపోయారు. రక్షణ ఇవ్వాల్సిన పోలీసులే భయపడి తమ ఇంట్లో దాక్కున్నారని బాధితురాలు శారద తెలిపారు.

క్రైమ్ మరిన్ని...