గుంటూరు: నరసరావుపేటలో ప్లెక్సీల కలకలం రేగింది. సీఎం జగన్ పర్యటన సందర్భంగా ప్రైవేట్ హాస్పటల్ భవనంపై వైసీపీ నాయకులు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఆ ప్లెక్సీని తొలగించడంతో వైసీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. టీడీపీ శ్రేణులు ఫ్లెక్సీని తొలగించారని ఆరోపించారు. అయితే తమ వద్ద అనుమతి తీసుకొనే ప్లెక్సీని ఏర్పాటు చేశారని హాస్పిటల్ యాజమాన్యం తెలిపింది. ఘటన స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. ప్లెక్సీలు తొలగించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు చెప్పారు.
ఇవి కూడా చదవండి