గుంటూరు: వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే బొల్లా నియోజకవర్గంలో విష సంస్కృతి తెచ్చారని మండిపడ్డారు. టీడీపీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే బొల్లాకు దమ్ముంటే తనతో తేల్చుకోవాలని సవాల్ విసిరారు. తనపై ఎన్ని తప్పుడు కేసులు పెట్టుకుంటారో పెట్టుకోమన్నారు. వినుకొండలో ఎమ్మెల్యే బొల్లా అరాచకాలను ఎదుర్కొంటానని జీవీ ఆంజనేయులు అన్నారు.
ఇవి కూడా చదవండి