టిడ్కో ఇళ్లను కేటాయించాలంటూ సీపీఐ ధర్నా

ABN , First Publish Date - 2020-10-20T18:00:53+05:30 IST

జిల్లా కార్పోరేషన్ ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా చేపట్టారు. టిడ్కో ఇళ్ళను లబ్ధిదారులకు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు.

టిడ్కో ఇళ్లను కేటాయించాలంటూ సీపీఐ ధర్నా

గుంటూరు: జిల్లా కార్పోరేషన్ ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా చేపట్టారు.  టిడ్కో ఇళ్ళను లబ్ధిదారులకు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ... లబ్దిదారులు టిడ్కో ఇళ్ళ కోసం డబ్బులు చెల్లించారని... రాజకీయాల కోసం టిడ్కో ఇళ్ళను ప్రభుత్వం వాడుకోవడం సిగ్గు చేటని విమర్శించారు. టిడ్కో ఇళ్ళను వెంటనే లబ్దిదారులకు అందించాలని డిమాండ్ చేశారు.


సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు మాట్లాడుతూ... మంత్రి బొత్స మైండ్ బ్లాంక్ అయిందని వ్యాఖ్యానించారు. మౌళిక సదుపాయాలు కల్పించకుండానే ఇళ్ళను ఇవ్వడానికి సిద్ధమవుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రం రెండు పార్టీలు, ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన ఆస్తి కాదన్నారు. తుఫాన్ కారణంగా అద్దె ఇళ్ళలో ఉంటున్న లబ్దిదారులు ఇబ్బందిపడుతున్నారని తెలిపారు.

Updated Date - 2020-10-20T18:00:53+05:30 IST