గుంటూరు: జిల్లాలోని నరసరావుపేటలో వైద్య సిబ్బందికి ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి స్వయంగా వ్యాక్సిన్ వేశారు. అటు పొన్నెకల్లులో ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి కూడా స్వయంగా వైద్య సిబ్బందికి వ్యాక్సిన్ వేశారు. అలాగే నగరంలో వ్యాక్సిన్ పంపిణీని ఎంపీ మోపిదేవి వెంకటరమణ ప్రారంభించారు. నాదెండ్లలో వ్యాక్సిన్ పంపిణీని ఎమ్మెల్యే విడదల రజనీ ప్రారంభించగా... వినుకొండలో ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు వ్యాక్సిన్ పంపిణీని ప్రారంభించారు.