నిశాంత కుమార్
నిషాంత్‌కుమార్ నేడు బాధ్యతల స్వీకారం
గుంటూరు(కార్పొరేషన్), జనవరి 26: గుంటూరు నగరపాలక సంస్థ నూతన కమిషనర్‌గా ఐఏఎస్ అధికారి నిషాంత్‌కుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించనున్నారు. జీఎంసీకి 26వ కమిషనర్‌గా ఆయన నియమితులయ్యారు. ఇప్పటివరకు కమిషనర్‌గా విధులు నిర్వహించిన చల్లా అనురాధను ఏపీఎంఐఎఫ్‌డీసీ ఈడీగా బదిలీ చేశారు. 2014 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన నిషాంత్‌కుమార్ ట్రైనింగ్ పూర్తయిన తరువాత తిరుపతి సబ్‌కలెక్టర్‌గా, రొంపచోడవరం ఐసీడీఏ పీడీగా, అనంతపురం జేసీగా పనిచేశారు. ఆయన విధుల్లో ముక్కుసూటిగా వ్యవహరిస్తారని తెలిసింది. అనంతపురం జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఓ నేత భూకబ్జాకు పాల్పడితే ఆ భూమిని తిరిగి ప్రభుత్వానికి చేర్చడంలో ఈయన కీలకపాత్ర వహించారు.