గుంటూరు: సంగం డైయిరీ నుంచి నూతన ఉత్పత్తి విడుదలైంది. సంగం కోల్డ్ కాఫీ, మిల్క్ ఫౌడర్, 400 గ్రాముల పెరుగు ప్యాక్‌లు విడుదలయ్యాయి. సోమవారం ఉదయం ప్రోడక్ట్‌ను డైయిరీ ఛైర్మన్ దూళిపాళ్ల నరేంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ధూళిపాళ్ల మాట్లాడుతూ... సంగం డైయిరీకి పాల ఉత్పత్తి దారులే బలమన్నారు. పాడి రైతులు సహకారంతో డైయిరీని మరింత ముందు తీసుకెళ్తామని తెలిపారు. ప్రస్తుతం డైయిరీ నుంచి 133 ఉత్పత్తులు ఉన్నాయని, తాజాగా మరో మూడు ఉత్పత్తులు విడుదల చేశామని చెప్పారు. భవిష్యత్‌లో మరిన్ని నూతన ఉత్పత్తులు తయారు చేస్తామన్నారు. కరోనా తర్వాత రెడీ టూ ఈట్ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుందని తెలిపారు. ప్రజలు అవసరాలకు తగ్గట్టుగా ఉత్పత్తులు తయారు చేస్తున్నామని ధూళిపాళ్ల నరేంద్ర పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎండీ గోపాలకృష్ణ,
పాలక వర్గ సభ్యులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి