గుంటూరు: జిల్లాలోని తెనాలి మండలం అంగలకుదురులో విషాదం చోటు చేసుకుంది. వివాహిత గాలి నాగలక్ష్మి తన ఇద్దరు పిల్లలకు పురుగుల మందు తాగించి తాను కూడా ఆత్మహత్యకు యత్నించింది. వీరిని గుర్తించిన స్థానికులు వెంటనే తెనాలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు పిల్లలు క్షేమంగా బయటపడ్డారు. కాగా... తల్లి నాగలక్ష్మి పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరుకు తరలించారు. మూడేళ్లుగా భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటూ అనారోగ్య కారణాలతో ఈ దారుణానికి పాల్పడినట్టు నాగలక్ష్మి సూసైడ్ లెటర్లో రాసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి