గుంటూరు: జిల్లాలోని పేరేచర్ల మైనర్ బాలిక అత్యాచారం కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. మంత్రి అనిల్ కుమార్ ముఖ్య అనుచరుడు, ఆప్కాబ్ ఛైర్మన్ కోండూరు అనిల్ బాబుపై ఎస్సీ కమిషన్కు బాలిక తండ్రి ఫిర్యాదు చేశారు. దీంతో అనిల్ బాబుపై విచారణ చేపట్టాలని గుంటూరు ఎస్పీకి ఎస్సీ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. నెల్లూరు జిల్లాలోని ఓ గెస్ట్ హౌస్లో బాలికని ఉంచి, పలువురు అత్యాచారం చేసినట్లు బాలిక తండ్రి ఆరోపించారు. గుంటూరు వెస్ట్ డిఎస్పీ సుప్రజ కేసును స్వయంగా విచారిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 60మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో ఎంపీ మోపిదేవి ప్రధాన అనుచరుడు కన్నా భూశంకర్ ఉన్నారు. బాలికపై వరసగా అత్యాచారానికి పాల్పడ్డ వారందరిపై చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి