గుంటూరు: జిల్లాలోని తెనాలిలో దారి దోపిడీ దొంగతనాలు ఎక్కువవుతున్నాయి. పెదరావూరు వద్ద పోలీసులమని చెప్పి వాహనదారుల దగ్గర దుండగులు డబ్బులు డిమాండ్ చేశారు. దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకోగా... మరో ఇద్దరు పరారయ్యారు. గత కొద్ది రోజుల నుంచి వరుస ఘటనలు జరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
ఇవి కూడా చదవండి