గుంటూరు: జిల్లాలోని మాచర్ల నియోజకవర్గం గుండ్లపాడులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. హత్యకు గురైన టీడీపీ నేత చంద్రయ్య మృతదేహాన్ని తరలించేందుకు పోలీసులు యత్నించారు. పోస్టుమార్టం కోసం తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు. అయితే బ్రహ్మారెడ్డి వచ్చేవరకు మృతదేహం కదిలించవద్దంటూ టీడీపీ నేతలు, స్థానికులు ఆందోళనకు దిగారు. మాచర్ల టీడీపీ ఇన్‌చార్జ్ బ్రహ్మారెడ్డి అనుచరుడు చంద్రయ్య. ఈ క్రమంలో బ్రహ్మారెడ్డి వచ్చే వరకు మృతదేహాన్ని తరలించవద్దంటూ ఆ పార్టీ నేతలు పట్టుబడుతున్నారు.
ఇవి కూడా చదవండి