Guntur: ముదురుతున్న శేకూరు దళితుల వివాదం

ABN , First Publish Date - 2022-01-10T16:58:05+05:30 IST

జిల్లాలో శేకూరు దళితుల వివాదం ముదురుతోంది. ఓ వర్గం యువకులు శేకూరు అంబేద్కర్ విగ్రహం వద్ద మద్యం సేవించగా...ఇందుకు మరో వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది.

Guntur: ముదురుతున్న శేకూరు దళితుల వివాదం

గుంటూరు: జిల్లాలో శేకూరు దళితుల వివాదం ముదురుతోంది.  ఓ వర్గం యువకులు శేకూరు అంబేద్కర్ విగ్రహం వద్ద మద్యం సేవించగా... ఇందుకు మరో వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయం లో రెండు వర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఓ వర్గానికి ఎంపీ నందిగం సురేష్  కొమ్ము కాసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పంచాయతీ అని పిలిచి చేబ్రోలు స్టేషన్ వద్ద ఓ వర్గంపై ఎంపీ వర్గం దాడికి పాల్పడింది. నిరసనగా గరవుపాలెం బ్రిడ్జి వద్ద బాధిత వర్గం ఆందోళనకు దిగింది. ఎంపీ నందిగం సురేష్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎస్పీని కలసిన దళిత సంఘాల నేత చార్వాకా... శేకూరు ఘటనపై విచారణ చేపట్టిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2022-01-10T16:58:05+05:30 IST