గుంటూరు: గుంటూరు: జిల్లాలోని తాడేపల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఆర్థిక సమస్యలతో దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతులు పాతూరి రత్తయ్య (60), నీరజ(56)గా గుర్తించారు. గ్రామానికి చెందిన పాతూరి రత్తయ్య... అయిన వాళ్లకు తన హామీగా అప్పులు ఇప్పించాడు. తీసుకున్న వాళ్లు అప్పులు చెల్లించకపోవడంతో రత్తయ్యపై ఒత్తిడి పెరిగింది. ఆస్తులు అమ్మి చెల్లించినా అప్పుల బాధ తీరకపోవడంతో రత్తయ్య తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. చివరకు భార్యతో కలిసి కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తాడేపల్లిలోని రత్తయ్య నివాసంలో సూసైడ్ లేఖ లభ్యమైంది. ఈపూరు మండలం ముప్పాళ్ళ వద్ద కాలవలో మృతదేహాలు లభ్యమయ్యాయి. దంపతులు కృష్ణా జిల్లా వాసులుగా తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి