మాచర్లలో లంబాడి మహిళ పొలం దున్నేసిన రెవిన్యూ సిబ్బంది

ABN , First Publish Date - 2021-10-04T18:27:11+05:30 IST

జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో లంబాడి మహిళ పట్ల రెవిన్యూ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. మహిళకు సంబంధించిన పొలాన్ని రెవిన్యూ సిబ్బంది హడావుడిగా దున్నేశారు.

మాచర్లలో లంబాడి మహిళ పొలం దున్నేసిన రెవిన్యూ సిబ్బంది

గుంటూరు: జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో లంబాడి మహిళ పట్ల రెవిన్యూ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. మహిళకు సంబంధించిన పొలాన్ని రెవిన్యూ సిబ్బంది హడావుడిగా దున్నేశారు. కారంపూడిలో గత 20 ఏళ్లుగా మహిళ భూమిని సాగు చేసుకుంటోంది. అయితే  ప్రభుత్వ భూమి అంటూ రెవిన్యూ సిబ్బంది మొత్తం దున్నేశారు. ఆ ప్రాంతంలో 30 ఎకరాలకు పైగా పొరంబోకు భూములను ఎంతో మంది సాగు చేసుకుంటున్నారని...అందరిని వదులేసి ఒంటరి మహిళనని తనపై ప్రతాపం చూపించారని మహిళ తెలిపింది.  కనీసం పంట ఉందన్న కనికరం కూడా లేకుండా దున్నేశారని మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. వైసీపీ వారి మాటలు విని తన పొలాన్ని అధికారులు ధ్వంసం చేశారని మహిళ ఆవేదన చెందారు. 

Updated Date - 2021-10-04T18:27:11+05:30 IST