Guntur: చిన్నారి ఆరాధ్య తల్లి ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2022-06-10T15:26:46+05:30 IST

చిన్నారి ఆరాధ్య తల్లి మోహన పావని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

Guntur: చిన్నారి ఆరాధ్య తల్లి ఆత్మహత్యాయత్నం

గుంటూరు: చిన్నారి ఆరాధ్య తల్లి మోహన పావని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కంటి కింద కణితి తొలగింపు కోసం గత నెలలో జీజీహెచ్‌లో చిన్నారి ఆరాధ్య... వైద్యుల నిర్లక్ష్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. చిన్నారి మృతిపై కలెక్టర్ కమిటీని ఏర్పాటు చేశారు. అయితే చిన్నారి మృతిపై నేటి వరకు కమిటీ నివేదిక రాని పరిస్థితి. దీనిపై చిన్నారి తల్లిదండ్రులు పలువురు ప్రజాప్రతినిధులు చుట్టూ తిరిగారు. ఈ క్రమంలో నిన్న ఎమ్మెల్సీ అప్పిరెడ్డిని ఆరాధ్య తల్లిదండ్రులు కలిశారు. అయితే అప్పిరెడ్డి వ్యాఖ్యలతో మనస్తాపానికి గురైన ఆరాధ్య తల్లి పావని బలవన్మరణానికి యత్నించింది. గమనించిన కుటుంబసభ్యులు పావనిని హుటాహుటిన జీజీహెచ్‌కు తరలించారు. 

Updated Date - 2022-06-10T15:26:46+05:30 IST