గుంటూరు: జిల్లాలోని నరసరావుపేట మండలం కేశానుపల్లి శివారులో ఉన్న ఆర్టీసీ కాలనీలో యువకులు వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో యువకులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఇదేంటని ప్రశ్నించిన స్థానికులపై యువకులు దాడికి పాల్పడ్డారు. ప్రశ్నించిన వ్యక్తుల ఇంటిపై దాడి చేసి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. కర్రలు, కత్తులతో అర్ధరాత్రి ఆర్టీసీ కాలనీలో 20 మంది యువకులు హంగామా సృష్టంచారు. దాడుల్లో ఆరుగురికి గాయాలవడంతో వెంటనే నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి