రాజధాని భూములను పంచుతారా?: జీవీ ధ్వజం

ABN , First Publish Date - 2020-02-20T07:42:34+05:30 IST

రాజ ధాని భూములను ప్లాట్లుగా వేసి పంచుతాం అంటూ ముఖ్యమంత్రి మాట్లాడటంపై టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ అంజనేయులు మండి పడ్డారు. రాజధాని తరలింపునకు నిరసనగా అమరావతి

రాజధాని భూములను పంచుతారా?: జీవీ ధ్వజం

గుంటూరు (తూర్పు), ఫిబ్రవరి 19: రాజ ధాని భూములను ప్లాట్లుగా వేసి పంచుతాం అంటూ ముఖ్యమంత్రి మాట్లాడటంపై టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ అంజనేయులు మండి పడ్డారు.  రాజధాని తరలింపునకు నిరసనగా అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట చేపట్టినరిలే నిరాహరదీక్షలు బుధవారం  53వ రోజుకు చేరుకున్నాయి. దీక్షలను ప్రారంభించిన జీవీ మాట్లాడుతూ సుమారు రూ. 1లక్ష 70వేల కోట్ల సంపద అమరావతి అని ఇప్పటికీ  గ్రహించకపోవడం ముఖ్యమంత్రి అవివేకానికి నిదర్శనమన్నారు. అటువంటి భూములను ప్లాట్లు వేస్తాను... పంచుతాను అంటూ జగన్‌ తుగ్లక్‌లా మాట్లాడుతు న్నారని విమర్శించారు. ఆరోగ్యశ్రీని కూడా విజయవంతంగా అటకెక్కిం చిన ఘనత ముఖ్యమంత్రికే దక్కిం దన్నారు. మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు మాట్లాడుతూ రాజ ధాని ఉద్యమంతో జగన్‌కు భయం పట్టుకుందని విమర్శిం చారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు  భద్రత తగ్గిస్తూ సీఎం నిర్ణయం తీసుకోవడమే దీనికి నిదర్శనమని విమర్శించారు.  ఇటువంటి వాటికి భయపడేది లేదని ఎట్టి పరిస్ధితులలో అమరావతి పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదన్నారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు మాట్లాడుతూ  మూడు ముక్కల కార్యక్రమాలకు ప్రజలనుంచి తిరుగుబాటు రావడంతో వైసీపీ నాయకులు తోకలు ముడిచారని విమర్శించారు. సీపీఐ ఆధ్వర్యంలో అనంతపురం నుంచి పెద్దఎత్తున రైతులతో రాజధాని ఉద్యమానికి సంఘీభావ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కార్య క్రమంలో జేఏసీ నేతలు జంగాల అజయ్‌కుమార్‌, కొరివి వినయ్‌ కుమార్‌, మానుకొండ శివప్రసాదు, ధారునాయక్‌,  వట్టికూటి హర్షవర్ధన్‌, కసుకుర్తి హనుమంతరావు, కంచర్ల శివరామయ్య, ఓంకార్‌, మన్నవ కోటేశ్వరరావు పాల్గొనగా దీక్షలలో రేపల్లె రైతులు నాగేశ్వరరావు, బాలాజీ, అజయ్‌కుమార్‌, వెంకయ్య, చినబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-02-20T07:42:34+05:30 IST