Abn logo
Feb 25 2021 @ 13:50PM

గుంటూరులో తెలంగాణ మద్యం పట్టివేత

గుంటూరు: జిల్లాలోని నకరికల్లు వద్ద పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో తెలంగాణ మద్యం పట్టుబడింది. అక్రమంగా తరలిస్తున్న 4656 సీసాల తెలంగాణ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం తరలిస్తున్న ఒక ఆటో, మినీ లారీ, కార్, రెండు బైకులను సీజ్ చేసిన పోలీసులు ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.  మరో ఐదుగురు పరారీలో ఉన్నారు. పట్టుబడిన మద్యం విలువ రూ.10 లక్షలుగా పోలీసులు అంచనా వేస్తున్నారు. మద్యాన్ని తెలంగాణ నుండి చిలకలూరిపేటకి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. 

Advertisement
Advertisement
Advertisement