గుంటూరు: పాల వాహనాలలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ రైస్‌ను అరండల్ పేట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శారదాకాలనీకి చెందిన మరియమ్మ అనే మహిళ అధిక ధరకు పీడీఎస్ రైస్‌ను విక్రయించేందుకు నిల్వ చేస్తోంది. మరియమ్మకు మరో ఐదుగురు వ్యక్తులు సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పీడీఎస్ రైస్‌ను అక్రమంగా తరలిస్తుండగా వాహనాలతో సహా రైస్ సీజ్ చేసి ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పీడీఎస్ రైస్ విలువ రూ.35లక్షలుగా తెలుస్తోంది. వాహనాలు సీజ్ చేసినట్టు డిఎస్పీ సుప్రజ తెలిపారు.