గుంటూరు: జిల్లాలోని సత్తెనపల్లిలో దారుణం చోటు చేసుకుంది. పాల డైరిలో రూ.50 అప్పు విషయంలో యువకుల మధ్య ఘర్షణ తలెత్తింది. గుమస్తా బాజి అనే యువకుడిపై మిగిలిన వారు పిడిగుద్దులతో దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన బాజి రోడ్డుపై కుప్పకూలి పడిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా బాజీ మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.