పోలీసు కుటుంబాలకు అండగా నిలబడతాం: గుంటూరు పోలీసులు

ABN , First Publish Date - 2020-10-21T16:17:53+05:30 IST

పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా నగరంపాలెంలోని పోలీసు అమరవీరుల స్థూపం వద్ద పలువురు పోలీసులు నివాళులర్పించారు.

పోలీసు కుటుంబాలకు అండగా నిలబడతాం: గుంటూరు పోలీసులు

గుంటూరు: పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా నగరంపాలెంలోని పోలీసు అమరవీరుల స్థూపం వద్ద పలువురు పోలీసులు, ఉన్నతాధికారులు నివాళులర్పించారు. జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్, జిల్లా జడ్జి గోపిచంద్, అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి, రూరల్ ఏస్పీ విశాల్ గున్ని, పోలీసు సిబ్బంది, పోలీసు కుటుంబాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ, అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి మాట్లాడుతూ...పోలీసులు అన్ని పరిస్థితుల్లో పని చేస్తున్నారన్నారు. కరోనా సమయంలో కూడా నిబద్దతతో పని చేశారని తెలిపారు. కొంత మంది ప్రాణాలు కోల్పోయారని.. అలాంటి పోలీసు కుటుంబాలకు అండగా నిలబడతామని స్పష్టం చేశారు. 




జిల్లా జడ్జి గోపిచంద్ మాట్లాడుతూ...సమాజంలో పోలీసు లేని పరిస్థితి ఊహించుకోలేనిదన్నారు. పోలీసు వ్యవస్థ ఎక్కడైతే శక్తి వంతంగా ఉంటుందో అక్కడ నేరాలు తగ్గుతాయని తెలిపారు. సమాజంలో ఉన్నా అవసరాలను బట్టి కొత్త చట్టాలు వస్తాయని... వాటి ప్రకారం పోలీసులు పని చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసే విధంగా చేయాలని అన్నారు. కోవిడ్ సమయంలో పోలీసులు చేసిన సేవలు మరువలేనివని అన్నారు. పోలీసు అమరవీరుల కుటుంబాలకు అందరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

Updated Date - 2020-10-21T16:17:53+05:30 IST