పాత గుంటూరు పోలీసు స్టేషన్‌పై ముస్లిం యువత దాడి ఘటనపై హైకోర్టులో విచారణ

ABN , First Publish Date - 2020-09-24T20:13:25+05:30 IST

పాత గుంటూరు పోలీసు స్టేషన్‌పై ముస్లిం యువత దాడి ఘటనపై హైకోర్టులో విచారణ

పాత గుంటూరు పోలీసు స్టేషన్‌పై ముస్లిం యువత దాడి ఘటనపై హైకోర్టులో విచారణ

అమరావతి: పాత గుంటూరు పోలీసు స్టేషన్‌పై ముస్లిం యువత దాడి ఘటనపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులపై ప్రాసిక్యూషన్ ఉపసంహరించుకుంటూ ఫిబ్రవరి 17న ప్రభుత్వానికి డీజీపీ లేఖ రాశారు. లేఖని ఆమోదిస్తూ ఆగస్ట్‌ 12న 776 జీవో విడుదలైంది. ప్రాసిక్యూషన్ ఉపసంహరించుకోవాలని స్టేషన్‌హౌస్ ఆఫీసర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు ఆదేశాలు చేశారు. ఈ అంశంపై తాజాగా పసుపులేటి గణేష్ అనే వ్యక్తి హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. పోలీస్‌ స్టేషన్‌పై దాడి కేసులో పోలీసులు ప్రాసిక్యూషన్ ఉపసంహరించుకోవడం ప్రజాప్రయోజనాలకు విరుద్ధమని పిటిషనర్ తరపు న్యాయవాదులు సురేష్‌కుమార్, చాణక్య పేర్కొన్నారు. ఇలాంటి నేరాలు భవిష్యత్‌లో పునరావృతం అయ్యేందుకు ఈ జీవో తావిస్తుంది..దీనిపై స్వతంత్ర దర్యాప్తు సంస్థతో సమగ్ర విచారణ జరపాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. జీవోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జీవోలోని భాషపైనా న్యాయమూర్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. జీవోలో నేరుగా ముస్లిం యువత అని పేర్కొనడాన్ని న్యాయమూర్తులు తప్పుపట్టారు. పిటిషన్‌లో ఎన్ఐఎని కూడా పార్టీగా చేర్చాలని ధర్మాసనం సూచించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశించింది. సదరు జీవో నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కేసు తదుపరి విచారణ అక్టోబరు 1వ తేదీకి ధర్మాసనం వాయిదా వేసింది. 

 

Updated Date - 2020-09-24T20:13:25+05:30 IST