గుంటూరు: జాబ్ క్యాలెండర్‌‌పై నిరుద్యోగుల ఆగ్రహం

ABN , First Publish Date - 2021-06-21T18:17:41+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌‌పై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గుంటూరు: జాబ్ క్యాలెండర్‌‌పై నిరుద్యోగుల ఆగ్రహం

గుంటూరు: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌‌పై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాంతీయ గ్రంధాలయం వద్ద నిరుద్యోగ జేఏసి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. జాబ్‌లు లేని జాబ్ క్యాలెండర్‌ ఎందుకని మండిపడుతున్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను జగన్ నెరవేర్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తక్షణమే మెగా డీఎస్సీ, పోలీసు నోటిఫీకేషన్ విడుదల చేయాలని నిరుద్యోగ జేఏసి రాష్ట్ర కన్వినర్ కొక్కలిగడ్డ సుబ్రమణ్యం డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-06-21T18:17:41+05:30 IST