Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

పాఠశాలల అభివృద్ధికి చర్యలు

twitter-iconwatsapp-iconfb-icon
పాఠశాలల అభివృద్ధికి చర్యలుహెచ్‌ఎంలతో చర్చిస్తున్న మాలకొండయ్యచౌదరి

ఉదయగిరి రూరల్‌, జనవరి 25: మండలంలోని గండిపాళెం జిల్లా పరిషత్‌ ఉన్నత, ప్రాథమిక పాఠశాలల అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని జీఎంకే ట్రస్టు అధినేత, మండల పరిషత్‌ ఉపాఽధ్యక్షుడు గుంటుపల్లి మాలకొండయ్యచౌదరి పేర్కొన్నారు. మంగళవారం ఆయన ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో వసతుల కల్పనపై చర్చించారు. తమ ట్రస్టు ఆధ్వర్యంలో క్రీడామైదానం అభివృద్ధితోపాటు విద్యార్థులకు అవసరమైన క్రీడా సామగ్రిని అందజేస్తున్నట్లు తెలిపారు. బుధవారం నిర్వహించే గణతంత్ర వేడుకల కోసం రూ.5 వేలు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పాముల రమణయ్య, పీఎంసీ చైర్మన్‌ షేక్‌ రియాజ్‌, అడుసమల్లి వెంకటసుబ్బయ్య, హెచ్‌ఎంలు  వెంకటేశ్వర్లు, జాఫర్‌సాహెబ్‌, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.