గుంటనక్క జల్లికట్టును అనుమతించాలి

ABN , First Publish Date - 2022-01-11T15:54:02+05:30 IST

పొంగల్‌ పండుగ సందర్భంగా ప్రతియేటా సంప్రదాయబద్ధంగా జరుపుకునే గుంటనక్క జల్లికట్టును అనుమతించాలని సేలం జిల్లాలోని కొంతమంది క్రీడాకారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వాళప్పాడి శాసనసభ

గుంటనక్క జల్లికట్టును అనుమతించాలి

                         - సేలంలో క్రీడాకారుల వినతి


ప్యారీస్‌(చెన్నై): పొంగల్‌ పండుగ సందర్భంగా ప్రతియేటా సంప్రదాయబద్ధంగా జరుపుకునే గుంటనక్క జల్లికట్టును అనుమతించాలని సేలం జిల్లాలోని కొంతమంది క్రీడాకారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వాళప్పాడి శాసనసభ నియోజకవర్గ పరిధిలో పొంగల్‌ పండుగను పురస్కరించుకుని వందేళ్లకు పైగా గుంటనక్కతో జల్లికట్టు పోటీలు ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి కారణంగా రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ ప్రాంతాల్లో నిర్వహించే పోటీలకు కట్టుబాట్లు విధించింది. ఈ నేపథ్యంలో వాళప్పాడి ప్రాంతం లోని చిన్నమనాయకన్‌ పాళయం, కొట్టవాళి, రంగనూర్‌, మద్దూర్‌, పెరియ కృష్ణాపురం తదితర గ్రామాల్లో మార్గశిర మాసంలో పంటకోతల అనంతరం తైమాసంలో కొత్తసాగు పనులు ప్రారంభించే ముందు నక్క ముఖం చూడాలన్న విశ్వాసం చాలామందిలో వుంది. నక్కను చూశాక పనులు ప్రారంభిస్తే పనులు ద్విగ్విజయంగా జరుగుతాయని ప్రజలు నమ్ముతున్నారు. ఇందులో భాగంగానే ప్రతియేటా జరుపుకుంటున్న గుంటనక్క పోటీలను ఈ ఏడాది కూడా అనుమతించాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - 2022-01-11T15:54:02+05:30 IST