Shinzo Abe death : గుండెలోకి చొచ్చుకెళ్లిన బుల్లెట్.. పోస్టుమార్టం రిపోర్టులో ఆసక్తిరమైన విషయాలు..

ABN , First Publish Date - 2022-07-09T00:52:34+05:30 IST

జపాన్(Japan) మాజీ ప్రధాని షింజో అబే(Shinzo Abe) పోస్టుమార్టం రిపోర్టును వైద్యులు వెల్లడించారు.

Shinzo Abe death : గుండెలోకి చొచ్చుకెళ్లిన బుల్లెట్.. పోస్టుమార్టం రిపోర్టులో ఆసక్తిరమైన విషయాలు..

టోక్యో : జపాన్(Japan) మాజీ ప్రధాని షింజో అబే(Shinzo Abe) పోస్టుమార్టం రిపోర్టును వైద్యులు వెల్లడించారు. గుండె(Heart)లోకి ఒక బుల్లెట్(Bullet) చొచ్చుకెళ్లింది. బుల్లెట్ తీవ్రతతో ఒక రంధ్రం ఏర్పడడంతో గుండె దెబ్బతిన్నదని తేలింది. మెడ, గుండెపై రెండు బలమైన గాయాలయ్యాయి. వీటి నుంచి తీవ్ర రక్తస్రావమవ్వడంతో షింజో అబే ప్రాణాలు వదిలారని నర మెడికల్ యూనివర్సిటీ హాస్పిటల్‌(Nara Medical University Hospital) డాక్టర్లు వెల్లడించారు. షింజో అబేకి వైద్యులు నాలుగున్నర గంటలకుపైగా చికిత్స అందించారు. రక్తస్రావాన్ని ఆపేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ప్రాణాలు దక్కుతాయనే ఆశతో రక్తమార్పడి కూడా చేశారు. కానీ ఫలితం దక్కలేదు. జపాన్ కాలమానం ప్రకారం.. సాయంత్రం 5.05 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారని చికిత్స నిర్వహించిన నర మెడికల్ యూనివర్సిటీ డాక్టర్లు తెలిపారు. మధ్యాహ్నం 12:20 గంటలకు ఆయణ్ణి హాస్పిటల్‌కు తీసుకొచ్చారు. హాస్పిటల్‌కి తీసుకొచ్చినప్పుడు ఆయన గుండెపోటు స్థితిలో ఉన్నారు. ప్రాణాన్ని కాపాడేందుకు ప్రయత్నాలు చేసినా ప్రయోజనం దక్కలేదని హాస్పిటల్ ఎమర్జెన్సీ మెడిసిన్ ప్రొఫెసర్ హిడెటడా ఫుకుషీమా తెలిపారు. ఈ మేరకు జపాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది. కాగా షింజో అబేని నర మెడికల్ యూనివర్సిటీ హాస్పిటల్‌లో చేర్పించే సమయానికే ఆయన ఊపిరితో ఉన్నట్టు కనిపించలేదన్న విషయం తెలిసిందే.


ఎన్నికల ప్రచారంలో కాల్పులు..

జపాన్‌ మాజీ ప్రధాన మంత్రి షింజో అబే దారుణ హత్యకు గురయ్యారు. పశ్చిమ జపాన్‌లోని నారా నగరంలో ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తుండగా ఆయనపై 41 ఏళ్ల నిరుద్యోగి కాల్పులు జరిపాడు. కాల్పులకు గురైన అబే వెంటనే కుప్పకూలిపోయారు. ఆయన తన ఛాతీని గట్టిగా అదిమిపట్టుకున్నట్లు వీడియాలో కనిపించింది. ఈ సంఘటన అనంతరం భద్రతా సిబ్బంది ఆయనను కాపాడేందుకు పరుగులు తీసిన విషయం తెలిసిందే.

Updated Date - 2022-07-09T00:52:34+05:30 IST