తుపాకీ బయటకు తీస్తుండగా.. నాన్నా.. అంటూ ఆ చిన్నారి రావడంతో..

ABN , First Publish Date - 2021-06-20T03:44:15+05:30 IST

ఓ ఆరేళ్ల చిన్నారి కరుడుగట్టిన నేరగాళ్ల మనసు మార్చింది. ఆ చిన్నారిలోని అమయాకత్వం ఆ రాక్షసుల్లోనూ మానవత్వాన్ని నిద్రలేపింది. దీంతో..ఓ కుటుంబపెద్ద ప్రాణాలతో బయటపడ్డాడు.

తుపాకీ బయటకు తీస్తుండగా.. నాన్నా.. అంటూ ఆ చిన్నారి రావడంతో..

న్యూఢిల్లీ: ఓ ఆరేళ్ల చిన్నారి కరుడుగట్టిన నేరగాళ్ల మనసు మార్చింది. ఆ చిన్నారిలోని అమయాకత్వం ఆ రాక్షసుల్లోనూ మానవత్వాన్ని నిద్రలేపింది. దీంతో..ఓ కుటుంబపెద్ద ప్రాణాలతో బయటపడ్డాడు. దేశరాజధానిలోని ఫరీదాబాద్‌ ప్రాంతంలో ఇటీవల జరిగిన దోపిడీ కేసును స్థానిక పోలీసులు ఇటీవల ఛేదించారు. ఈ కేసులో నిందితులైన సుమిత్, మనోహర్, అజెయ్, సౌరవ్‌లను అదుపులోకి తీసుకుని విచారించగా పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నెల తొమ్మిదో తారీఖున నిందితులు..నగదు బదిలీ చేసే మనీట్రాన్స్‌ఫర్ షాపులో దోపిడికీ పాల్పడ్డారు. షాపు యజమానిని తుపాకీతో బెదిరించి నగదుతో పారిపోయారు. వాస్తవానికి అతడిపై కాల్పులు జరిపి అక్కడున్న సోమ్ముతో పరారవ్వాలనేది  వీరి ప్లాన్. 


అదే ఆలోచనతో వారు షాపులోకి అడుగుపెట్టారు. తమ దగ్గర దాచి ఉంచిన తుపాకీని బయటకు తీస్తుండగా.. షాపు యజమాని కూతురు(6) తలుపు తోసుకుని లోపలికి వచ్చింది. కౌంటర్ వద్ద నిలబడి..నాన్నా అంటూ ఏదో చెప్పడం ప్రారంభించింది. ఇదంతా చూసిన వారు ఆ చిన్నారి ముందే ఆమె తండ్రిపై కాల్పులు జరపలేపోయారు. ఆమెను చూసి వెనక్కు తగ్గారు. ఆ చిన్నారి తిరిగి వెళ్లిపోయేంత వరకూ ఓపిగ్గా ఎదురు చూసి ఆ తరువాత షాపు యజమానికి బెదిరించి..సొమ్ముతో పారిపోయారు. కాగా.. గురువారం నాడు నిందితులను పోలీసులు అదులోకి తీసుకున్నారు. వీరి అరెస్టుతో దాదాపు అరడజనుకు పైగా దోపిడీ కేసులు పరిష్కారమయ్యాయని పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-06-20T03:44:15+05:30 IST