SANITATION, ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యం: మేయర్‌ సుధారాణి

ABN , First Publish Date - 2022-05-13T17:55:47+05:30 IST

పారిశుధ్యం (SANITATION) నగర వాసులు, బల్దియా కార్మికుల ఆరోగ్య సంరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు మేయర్‌ గుండు సుధారాణి (GUNDU SUDHARANI) వెల్లడించారు.

SANITATION, ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యం: మేయర్‌ సుధారాణి

హనుమకొండ: పారిశుధ్యం (SANITATION), నగర వాసులు, బల్దియా  కార్మికుల ఆరోగ్య సంరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు మేయర్‌ గుండు సుధారాణి (GUNDU SUDHARANI) వెల్లడించారు. గురువారం హనుమకొండలోని ఓ హోటల్‌లో నీతి అయోగ్‌ ఆధ్వర్యంలో ‘పట్టణ, ఆరోగ్య వ్యవస్థ పాలన బలోపేతం’ అనే అంశంపై ప్రభుత్వ వివిధ శాఖల అధికారులతో సంప్రదింపుల కార్యక్రమం నిర్వహించారు.

ముఖ్యఅతిథిగా హాజరైన మేయర్‌  ఈ సందర్భంగా మాట్లాడుతూ .. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యం, పారిశుధ్యం అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ..నగర వాసుల ఆరోగ్య సంరక్షణలో కీలకపాత్ర పోషించే బల్దియా పారిశుధ్య కార్మికులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు చెప్పారు. తరుచూ వారి కోసం ఆరోగ్య శిబిరాలు నిర్వహించి వైద్యసేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. మానవ వ్యర్థాల శుద్ధీకరణలో మెకనైజ్‌డ్‌ విధానాన్ని అనుసరిస్తున్నట్లు చెప్పారు. అమ్మవారిపేటలో ఉన్న 13  కేఎల్‌డీ సామర్థ్యం ఉన్న ఎఫ్‌ఎ్‌సటీపీకి అదనంగా మరో 150 కేఎల్‌డీ సామర్థ్యం గల మరో ప్లాంట్‌ నిర్మాణంలో ఉన్నట్లు చెప్పారు. నగరంలో ప్లాస్టిక్‌ నిర్మూలనకు పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. జీడబ్ల్యూఎంసీ పరిధిలో డీఆర్‌సీ కేంద్రాలు ఏర్పాటు, ఇంటింటి నుంచి తడి, పొడి చెత్త సేకరణ, బయో మైనింగ్‌ పద్ధతి తదితర అంశాలను మేయర్‌ సుధారాణి ప్రస్తావించారు. వరంగల్‌ జిల్లా కలెక్టర్‌ గోపీ మాట్లాడుతూ.. తెలంగాణా రాష్ట్రప్రభుత్వం రూ.1100 కోట్లతో మల్టీసూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి చర్యలు చేపట్టిందన్నారు. పనులు కూడా జరుగుతున్నాయన్నారు. జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌ ప్రావీణ్య మాట్లాడుతూ నీటి కాలుష్య నివారణకు, వ్యాధుల ప్రబలకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో నీతి అయోగ్‌ స్పెషల్‌ సెక్రెటరీ రాజేశ్వరరావు పాల్గొన్నారు. 

Read more