జిల్లా అభివృద్ధిపై చర్చకు సిద్ధమా?

ABN , First Publish Date - 2020-07-10T10:15:48+05:30 IST

జిల్లా అభివృద్ధిపై శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు కాని, వైసీపీ నేత లు కాని చర్చకు సిద్ధమా? అని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత గుండ అప్పలసూర్యనారా యణ సవాల్‌ విసిరారు.

జిల్లా అభివృద్ధిపై చర్చకు సిద్ధమా?

 ఎమ్మెల్యే ధర్మానకు  మాజీ మంత్రి అప్పలసూర్యనారాయణ సవాల్‌


గుజరాతీపేట: జిల్లా అభివృద్ధిపై శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు కాని, వైసీపీ నేత లు కాని చర్చకు సిద్ధమా? అని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత  గుండ అప్పలసూర్యనారా యణ సవాల్‌ విసిరారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘జిల్లాను విభజిస్తే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి హయాంలో చేపట్టిన అభివృద్ధి అంతా శూన్య మైపోతుందని ఎమ్మెల్యే ధర్మాన ఒకపక్క చెబు తూ, మరోపక్క టీడీపీ హయాంలో జిల్లాను ఎటువంటి అభివృద్ధి చేయలేదనడం సరికాదు. ధర్మాన మాటలు సత్య దూరంగా ఉన్నాయి.


1989లో దివంగత ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు క్యాబినెట్‌లో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఎచ్చెర్లలో అంబేడ్కర్‌ యూనివర్సిటీ, నైరలో వ్యవసాయ కళాశాలను ఏర్పాటు చేసింది నిజం కాదా?. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాబా ర్డు నిధులతో  డే అండ్‌ నైట్‌ జంక్షన్‌ వద్ద నాగావళి నదిపై  వంతెన నిర్మించాం. మున్సిపల్‌ చైర్మపర్సన్‌గా పైడిశెట్టి జయంతి, ఎమ్మెల్యేగా నేను ఉన్నప్పుడు ము న్సిపాలిటీ నుంచి స్థలం కొనుగోలు చేసి గృహాలు నిర్మించాం. ఈ ఇళ్లనే కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత రాజీవ్‌ గృహ కల్ప పేరుతో ప్రజలకు అం దివ్వడం నిజం కాదా?. నగరంలో 80 అడుగుల రోడ్డు కోసం  కొంత సలాన్ని కేటా యించిన విషయం మీకు తెలియదా?’’ అని అప్పలసూర్యనారాయణ ప్రశ్నించారు.  

Updated Date - 2020-07-10T10:15:48+05:30 IST