Abn logo
Oct 30 2020 @ 21:39PM

‘శాకుంతలం’.. గొప్పతనమిదంటోన్న గుణశేఖర్‌

Kaakateeya

సంచలన దర్శకుడు గుణశేఖర్‌ రీసెంట్‌గా 'శాకుంతలం' అనే చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన చేయాలనుకున్న 'హిరణ్యకశ్యప' కంటే ముందు ఈ చిత్రం రూపొందించనున్నట్లుగా తెలుపుతూ.. 'శాకుంతలం'కు సంబంధించిన మోషన్‌ పోస్టర్‌ను కూడా ఆయన విడుదల చేశారు. మణిశర్మ మ్యూజిక్‌ మ్యాజిక్‌తో ఉన్న ఈ మోషన్‌ పోస్టర్‌ మంచి స్పందనను రాబట్టుకుంటోంది. అయితే 'శాకుంతలం' యొక్క విశిష్టతను తెలుపుతూ.. తాజాగా గుణశేఖర్‌ ఓ ట్వీట్‌ చేశారు. 


''కాళిదాసు రచనలో వచ్చిన శకుంతల, దుష్యంతుల ప్రేమకథ.. వెస్ట్రన్‌ భాషలలో అనువాదం అయిన భారతీయ నాటకాలలో మొట్టమొదటిది. ఈ ప్రేమకథను 1789లో విలియమ్‌ జోన్స్‌ అనువదించగా.. ఆ తర్వాత వంద సంవత్సరాలకి.. అంటే 1889లో ఈ నాటకం 46 భాషలలోకి అనువాదం అయింది. నార్వేజియన్‌, ఫ్రెంచ్‌, ఆస్ట్రియన్‌, ఇటాలియన్‌ వంటి మొదలగు భాషలు ఇందులో ఉండటం విశేషం.." అని గుణశేఖర్‌ తన తాజా ట్వీట్‌లో పేర్కొన్నారు. 


Advertisement
Advertisement