`రుద్రమదేవి` వంటి చారిత్రాత్మక చిత్రం తీసి మెప్పించిన దర్శకుడు గుణశేఖర్ ప్రస్తుతం పౌరాణిక సినిమా `శాకుంతలం`పై దృష్టి సారించారు. శకుంతల క్యారెక్టర్ చేయడానికి సమంత ఓకే అనేసింది. ఇటీవల టైటిల్ మోషన్ పోస్టర్ కూడా విడుదలైపోయింది. అయితే దుష్యంతుడు ఎవరనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.
దుష్యంతుడి పాత్రలో నటించేందుకు రానా అంగీకరించలేదని, దీంతో మలయాళ, తమిళ హీరోల వైపు గుణశేఖర్ చూస్తున్నారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై తాజాగా చిత్రయూనిట్ స్పందించింది. `శాకుంతలం` సినిమాలో ఇతర పాత్రల ఎంపిక ఇంకా పూర్తి కాలేదని, ఇలాంటి సమయంలో ఎవరెవరి పేర్లనో ప్రచారంలోకి తీసుకురావొద్దని విజ్ఞప్తి చేసింది.