జక్కాపూర్‌లో తుపాకుల కలకలం

ABN , First Publish Date - 2020-07-06T11:45:18+05:30 IST

నారాయణరావుపేట మండలం జక్కాపూర్‌లో ఓ వ్యక్తి ఇంట్లో తుపాకులు దొరకడం స్థానికంగా కలకలం రేపుతోంది.

జక్కాపూర్‌లో తుపాకుల కలకలం

స్వాధీనం చేసుకున్న సిరిసిల్ల పోలీసులు

విషయం తెలియదన్న సిద్దిపేట పోలీసులు


సిద్దిపేట క్రైం, జూలై 5: నారాయణరావుపేట మండలం జక్కాపూర్‌లో ఓ వ్యక్తి ఇంట్లో తుపాకులు దొరకడం స్థానికంగా కలకలం రేపుతోంది. గ్రామానికి చెందిన దివ్యాంగుడైన విఠల్‌ ఇంట్లో మెట్ల కింద 4 తుపాకులను రాజన్నసిరిసిల్ల జిల్లా పోలీసులు స్వాధీనంచేసుకుని అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. విఠల్‌కు తుపాకులు ఏ విధంగా వచ్చాయి, అతనికి మావోయిస్టులకు ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఈ ఘటనపై సిద్దిపేట జిల్లా పోలీసులను వివరణ కోరగా తమకు విషయం తెలియదని, తనిఖీల విషయంలో ఎలాంటి సంబంధం లేదని చెప్పడం గమనార్హం. సొంత జిల్లాలో జరిగిన సంఘటనపై పోలీసులు స్పందించకపోవడంతో స్థానిక ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. తుపాకుల కలకలంతో గ్రామస్థులు భయబ్రాంతులకు గురవుతున్నారు.

Updated Date - 2020-07-06T11:45:18+05:30 IST