Apr 21 2021 @ 00:41AM

డిఫరెంట్‌గా గల్లీ రౌడీ

‘‘ఎవరైనా మనవణ్ణి ఇంజినీర్‌, డాక్టర్‌ని చేస్తారు. బాగా బలిసి కొట్టుకుంటే ఎమ్మెల్యేని చేస్తాడు. కానీ ఓ తాత తన మనవణ్ణి రౌడీని చేశాడు. అది ఎందుకో తెలియాలంటే మా‘గల్లీ రౌడీ’ సినిమా చూడాల్సిందే’’ అని దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి అన్నారు.  సందీప్‌ కిషన్‌ హీరోగా ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘గల్లీ రౌడీ’. నేహాశెట్టి హీరోయిన్‌. కోన వెంకట్‌ కథ, సమర్పణలో ఎం.వి.వి. సత్యనారాయణ నిర్మించారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతున్న ఈ చిత్రం టీజర్‌ను ఇటీవల హీరో విజయ్‌ దేవరకొండ ఆవిష్కరించి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. రాజేంద్రప్రసాద్‌, బాబీ సింహ, పోసాని కృష్ణ మురళీ, వెన్నెల కిషోర్‌ కీలకపాత్రల్లో నటించిన ఈ చిత్రానికి చౌరస్తా రామ్‌, సాయికార్తీక్‌ సంగీతం అందించారు.