రామేశ్వరం: తమిళనాడులోని రామేశ్వరంలోగల గల్ఫ్ ఆఫ్ మన్నార్ సముద్రంపై అత్యంత విచిత్ర రీతిలో నీటి సుడిగాలులు కనిపించాయి. దీనిని సముద్రంలోనున్న ఒక మత్స్యకారుడు గమనించి, అందరికీ తెలియజేశాడు. ఈ ఘటనను ఫొటో తీసేందుకు కూడా ప్రయత్నించాడు.
రామనాథపురం మత్స్య విభాగం తెలిపిన వివరాల ప్రకారం సముద్రంలో నీటి సుడిగాలి ఏర్పడింది. నీటిపై గాలి కదలికల వలన ఇది సంభవించింది. తేమతో ఉన్నగాలి పైకి చేరుతున్నప్పుడు ఇలా ఏర్పడుతుంది. సాధారణంగా గాలి భ్రమణం కారణంగా సుడిగాలులు ఏర్పడుతాయి. అయితే నీటి సుడిగాలులు సాధారణ గాలి సుడిగాలులు కన్నా ప్రమాదకరమైనవి. ఇటువంటి నీటి సుడిగాలులుల ఉష్ణమండల ప్రాంతంలో సంభవిస్తుంటాయి. ఇవి అరుదుగా కనిపిస్తుంటాయి.