Advertisement
Advertisement
Abn logo
Advertisement

కడప వరద బాధితులకు దుబాయిలోని ప్రవాసీయుల చేయూత!

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిథి: ఏపీలో సంభవించిన జలప్రళయంతో నెలకొన్న దయనీయ పరిస్ధితులను చూసి గల్ఫ్ దేశాలలోని ప్రవాసీయులు చలించిపోతున్నారు. గల్ఫ్ వలసలకు పేరుపడ్డ కడప జిల్లా రాజంపేట పరిసర ప్రాంతాలకు చెందిన అనేక మందికి వచ్చిన అపద గూర్చి తెలుసుకుని ఆవేదన చెందుతున్నారు. ఈ క్రమంలో కొందరు ప్రవాసీయులు రాజంపేట వాసులకు తమకు వీలయిన విధంగా చేయూత అందించడానికి ముందుకు వస్తున్నారు. కువైత్‌లోని ప్రవాసీయులు బాధిత కుటుంబాలకు సహాయమందిస్తుండగా, దుబాయిలో కూడా ఈ కార్యక్రమం జరుగుతోంది. దుబాయిలో కోస్టా ట్రావెల్స్ నిర్వహిస్తున్న కడప జిల్లా పులపూత్తూరు గ్రామానికి చెందిన రెడ్డయ్య, మరికొందరి సహకారంతో బాధితులకు అవసరమైన అత్యవసర గృహోపయోగ పరికరాలు అందిస్తున్నారు.

TAGS: NRI
Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement