గుక్కెడు నీటి కోసం తిప్పలు

ABN , First Publish Date - 2022-05-03T04:32:58+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం అన్ని గ్రామాలకు మిషన్‌భగీరథ ద్వారా తాగు నీటిని అందిస్తున్నామని గొప్పలకు పోతోం ది. కానీ జిల్లా ఏజెన్సీలో గుక్కెడు తాగు నీటి కోసం గిరిజనులు పడుతున్న పాట్లు వర్ణనాతీతం.

గుక్కెడు నీటి కోసం తిప్పలు
నెత్తిన బిందె చంకన చంటి బిడ్డతో నీటిని తీసుకెళుతున్న ఆదివాసీ మహిళలు

- చుక్కనీరందించని మిషన్‌ భగీరథ

- తెల్లారితే పిల్లా పాపలతో కలిసి నీటి కోసం పాట్లు  

తిర్యాణి, మే 2: రాష్ట్ర ప్రభుత్వం అన్ని గ్రామాలకు మిషన్‌భగీరథ ద్వారా తాగు నీటిని అందిస్తున్నామని గొప్పలకు పోతోం ది. కానీ జిల్లా ఏజెన్సీలో గుక్కెడు తాగు నీటి కోసం గిరిజనులు పడుతున్న పాట్లు వర్ణనాతీతం. తిర్యాణి మండలం గుండాల పంచాయతీ పరిధిలో నాలుగు గ్రామా లకు మిషన్‌ భగీరథ పైపులైన్‌ వేసినా నేటికీ చుక్కనీరు రాని పరిస్థితి. దీంతో నాలుగు గ్రామాలకు ఏకైక దిక్కు అయినా చేదబావికి విద్యుత్‌ పంపుసెట్‌ ఏర్పాటు చేశారు. కానీ అదీ పనిచేయక పోవడంతో చిన్నారులు ప్రమాదకరమైన పరిస్థితుల్లో బకెట్‌ల ద్వారానీటిని తోడుతున్నారు. నీటి కోసం కిలోమీటర్ల దూరం ప్రయాణించి బిందెలతో నీటిని తీసుకెళ్లుతున్న పరిస్థితి ఇక్కడ కొనసాగుతోంది.

రెండు బిందెలు కూడా నిండడం లేదు

-  తిరుపతి, గుండాల

గ్రామంలో రెండు చేతి పంపులు ఉన్నప్పటికీ గంటల తరబడి కొట్టినా రెండు బిందెలు కూడా రావడంలేదు. సమీప వ్యవసాయ బావుల నుంచి నీటిని తెచ్చుకుంటున్నాం. ప్రస్తు తం బావులు కూడా అడుగంటి పోతుం డడంతో నీటి కోసం ఎక్కడికి వెళ్లాలో అర్థం కావడం లేదు. 

నీరందిస్తాం

- కృష్ణ తేజ, ఏఈ, మిషన్‌ భగీరథ 

బూసిమెట్ట పంప్‌హౌజ్‌ వద్ద నూత నంగా పంపు నిర్మిస్తున్నాం. ఈ కారణంగా కొన్ని రోజులుగా మిషన్‌ భగీరథ నీరు సరఫరా కావడంలేదు. త్వరలోనే అన్ని గ్రామాలకు నీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటాం.

Read more