Advertisement
Advertisement
Abn logo
Advertisement

సింగర్‌ను కరెన్సీ నోట్లతో ముంచెత్తిన అభిమానులు.. Video Viral

గుజరాత్: అభిమానులు వారికి ఇష్టమైనవారికి పాలాభిషేకం, పూలాభిషేకం చేయడం చూస్తాం.. కానీ గుజరాత్‌లో ఓ జానపద సింగర్‌ను ఫ్యాన్స్ కరెన్సీ నోట్లతో ముంచెత్తారు. ఆమె స్టేజ్‌పై పాడుతున్నంతసేపు అభిమానులు ఆమెపై కరెన్సీ నోట్లు వెదజల్లుతూనే ఉన్నారు. దీంతో ఆ వేదిక మొత్తం కరెన్సీ నోట్లతో నిండిపోయింది.


గుజరాత్‌కు చెందిన ‘శ్రీ సమస్త్ హరిద్వార్ సంఘం’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో సంగీత కచేరి చేసేందుకు జానపద గాయనీ రాధాదియాను ఆహ్వానించారు. తన బృందంతో పాటలు పాడుతున్న సమయంలో సంఘం సభ్యులు, ప్రేక్షకులు ఆమెపై కరెన్సీ నోట్లు వెదజల్లారు. బకెట్లలో డబ్బులు తీసుకువచ్చి ఆమెపై పోశారు. దీనికి సంబంధించిన వీడియోను గాయనీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. లక్షల మంది వీక్షించారు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. 

Advertisement
Advertisement