Advertisement
Advertisement
Abn logo
Advertisement
Nov 29 2021 @ 12:51PM

Gujaratలో అతి భారీవర్షాలు...ఐఎండీ ఆరంజ్ అలర్ట్ జారీ

అహ్మదాబాద్ : గుజరాత్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో డిసెంబర్ 1,2 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది.గుజరాత్‌లోని ఆనంద్, భరూచ్, నవ్‌సారి, వల్సాద్, అమ్రేలి, భావ్‌నగర్ జిల్లాల్లో డిసెంబర్ 1న వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.  డిసెంబర్ 2న ఐఎండీ ఎల్లో అలర్ట్ ప్రకటించింది.భారీవర్షాల నేపథ్యంలో నవంబర్ 30 నుంచి డిసెంబర్ 2 వరకు ఉత్తర, దక్షిణ గుజరాత్ తీరంలో మత్స్యకారులు చేపలవేటకు సముద్రంలో వెళ్లరాదని ఐఎండీ హెచ్చరిక జారీ చేసింది. అకాల వర్షం కారణంగా రైతులు పండించిన పంటలను కాపాడుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఐఎండీ అధికారులు సూచించారు.

నవంబర్ 30న దక్షిణ గుజరాత్‌లోని అన్ని జిల్లాలతో పాటు అహ్మదాబాద్, ఆనంద్, ఖేడా, పంచమహల్, దాహోద్, సురేంద్రనగర్, రాజ్‌కోట్, పోర్ బందర్, జునాగఢ్, అమ్రేలిలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40-60 కిలోమీటర్ల వేగంతో ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. భావ్‌నగర్, గిర్ సోమనాథ్, బోటాడ్, డయ్యూ.పంచమహల్, దాహోద్, ఛోటా ఉదేపూర్‌తో పాటు అమ్రేలి, జునాగఢ్, గిర్ సోమనాథ్, బోటాడ్  సౌరాష్ట్ర జిల్లాల్లోని ఆనంద్, భరూచ్, నవ్‌సారి, వల్సాద్ సూరత్, డాంగ్స్చతాపీలలో డిసెంబర్ 1న అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు తెలిపారు.

డిసెంబరు 2న బనస్కాంత, సబర్‌కాంత, ఆరావళి, మహిసాగర్‌, డాంగ్స్‌, తాపీ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జఖౌ, మాండ్వి (కచ్), ముంద్రా, న్యూ కాండ్లా, నవ్‌లాఖి, జామ్‌నగర్, సలాయా, ఓఖా, పోర్‌బందర్ సహా ఉత్తర గుజరాత్ తీరం వెంబడి మత్స్యకారులకు హెచ్చరిక జారీ చేశారు.నవంబర్ 30 నుంచి డిసెంబర్ 2 వరకు ఉత్తర గుజరాత్ తీరం వెంబడి ఆనుకుని ఉన్న ఈశాన్య అరేబియా సముద్రం మీదుగా గంటకు 40-50 కిలోమీటర్ల వేగం నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. 


Advertisement
Advertisement