GT vs RR: క్వాలిఫైయర్-1లో గెలిచేదెవరంటే.. ఈ వార్త చూస్తే 90 శాతం క్లారిటీ వస్తుంది..

ABN , First Publish Date - 2022-05-24T02:46:02+05:30 IST

ఐపీఎల్‌లో లీగ్ మ్యాచ్‌లు ముగిశాయి. 70 లీగ్ మ్యాచుల తర్వాత కీలక మ్యాచులకు సమయం ఆసన్నమైంది. మరో నాలుగు మ్యాచులు మాత్రమే ఈ ఐపీఎల్ సీజన్‌లో..

GT vs RR: క్వాలిఫైయర్-1లో గెలిచేదెవరంటే.. ఈ వార్త చూస్తే 90 శాతం క్లారిటీ వస్తుంది..

ఐపీఎల్‌లో లీగ్ మ్యాచ్‌లు ముగిశాయి. 70 లీగ్ మ్యాచుల తర్వాత కీలక మ్యాచులకు సమయం ఆసన్నమైంది. మరో నాలుగు మ్యాచులు మాత్రమే ఈ ఐపీఎల్ సీజన్‌లో మిగిలి ఉన్నాయి. మే 24న గుజరాత్ టైటాన్స్, రాజస్తాన్ రాయల్స్ జట్ల మధ్య క్వాలిఫైయర్-1 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు వెళుతుంది. ఓడిన జట్టు ఫైనల్‌కు వెళ్లేందుకు మరో అవకాశం ఉంటుంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో నెగ్గిన టీంతో క్వాలిఫైయర్-2లో తలపడి గెలిస్తే ఫైనల్‌కు వెళ్లొచ్చు. గుజరాత్ జట్టు 14 మ్యాచులు ఆడి 4 మాత్రమే ఓడి 10 మ్యాచుల్లో గెలిచి సత్తా చాటింది. 20 పాయింట్లతో ఐపీఎల్ పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో ఉంది. క్వాలిఫైయర్-1 మ్యాచ్‌కు కోల్‌కత్తా ఈడెన్ గార్డెన్స్ వేదిక కానుంది. Gujarat Titans, Rajasthan Royals టీమ్స్ మధ్య ఈ సీజన్‌లో ఒక మ్యాచ్ జరిగింది. గుజరాత్ ఆ మ్యాచ్‌లో 37 పరుగుల తేడాతో గెలుపొందింది.



GT, RR బలాబలాలను పరిశీలిస్తే.. గుజరాత్ జట్టు కేవలం ప్లే-ఆఫ్స్‌కు క్వాలిఫై కావడమే కాదు ఈ సీజన్‌లో అద్భుతంగా రాణించి Table Toppersగా నిలిచింది. బౌలింగ్ విభాగంలో రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, ఫెర్గ్యూసన్ ఆ జట్టుకు ప్రధాన బలం. స్పిన్ కంటే ఫాస్ట్ బౌలర్ల కారణంగానే ఈ సీజన్‌లో గుజరాత్ ఎంతో లాభపడింది. షమీ బౌలింగ్ గుజరాత్‌కు కలిసొస్తున్న మరో ప్రధాన అంశం. హార్థిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్ Best Finishers పాత్ర పోషిస్తున్నారు. అయితే.. గుజరాత్ టైటాన్స్ జట్టును కలవరపెడుతున్న అంశం ఏంటంటే.. Top Order అంత బలంగా లేకపోవడం. మరీ ముఖ్యంగా.. 3, 4 స్థానాల్లో బ్యాటింగ్‌కు ఆడుతున్న వారు అంతగా రాణించకపోవడం. గిల్ అంతగా రాణిస్తున్నా, లేకపోయినా సాహా ఆ లోటును పూడ్చుతున్నాడు. కానీ.. 3, 4 స్థానాల్లో బ్యాటింగ్‌కు వస్తున్న వారు మాత్రం అంతగా రాణించడం లేదు. ఈ బలహీనతను గుర్తించి సమర్థంగా రాణిస్తే గుజరాత్‌కు తిరుగే ఉండకపోవచ్చు.



ఇక.. RR విషయానికొస్తే.. ఈ జట్టు ప్రధాన బలం ఆర్.అశ్విన్, చాహల్. ఈ స్పిన్ ద్వయం అద్భుతంగా రాణిస్తూ RRను గండాల నుంచి గట్టెక్కిస్తున్నారు. అశ్విన్ అయితే బ్యాటింగ్‌లో కూడా రాణిస్తూ RRకు అండగా నిలుస్తున్నాడు. ఈ జట్టుకు బలం, బలహీనత జాస్ బట్లర్ అవుతున్నాడు. అత్యధిక పరుగులు చేసి Orange Capను సొంతం చేసుకున్న బట్లర్ ఈ సీజన్‌లో 629 పరుగులు చేశాడు. కానీ.. గత ఏడు మ్యాచుల్లో బట్లర్ కేవలం 138 పరుగులు మాత్రమే చేశాడు. ఐదు మ్యాచుల్లో అయితే PowerPlay పూర్తయ్యే లోపే పెవిలియన్ బాట పట్టాడు. బట్లర్, సంజూ శాంసన్, హెట్మయిర్ కనుక బ్యాటింగ్‌లో రాణిస్తే RR పరుగుల వరద పారించడం ఖాయం.

Updated Date - 2022-05-24T02:46:02+05:30 IST