‘హర్ ఘర్ తిరంగా’పై అవగాహన కోసం.. ఖరీదైన జాగ్వార్ కారును ఏం చేశాడో చూడండి!

ABN , First Publish Date - 2022-08-15T02:45:42+05:30 IST

దేశం మొత్తం స్వాతంత్ర్య వజ్రోత్సవాలు జరుపుకుంటున్న వేళ గుజరాత్‌కు చెందిన సిద్ధార్థ్ జోషి తన ఖరీదైన జాగ్వార్

‘హర్ ఘర్ తిరంగా’పై అవగాహన కోసం.. ఖరీదైన జాగ్వార్ కారును ఏం చేశాడో చూడండి!

న్యూఢిల్లీ: దేశం మొత్తం స్వాతంత్ర్య వజ్రోత్సవాలు జరుపుకుంటున్న వేళ గుజరాత్‌కు చెందిన సిద్ధార్థ్ జోషి తన ఖరీదైన జాగ్వార్ కారును మువ్వన్నెల జెండాలా మార్చేశాడు. ‘హర్ ఘర్ తిరంగా’పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రెండు లక్షల రూపాయలు ఖర్చు చేసి తన జాగ్వార్ కారుపై జాతీయ జెండా రంగులను చిత్రించాడు. అనంతరం ఆ కారులో సూరత్ నుంచి ఢిల్లీకి రెండు రోజుల్లో చేరుకున్నాడు. పార్లమెంటు వద్ద కారుతో చక్కర్లు కొట్టాడు. అతడితోపాటు కారులో ఉన్నవారు జాతీయ జెండాను ఊపుతూ కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కారు బానెట్‌పై ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ అని రాశాడు. 


‘హర్ ఘర్ తిరంగా’ ప్రజల్లో అవగాహన కల్పించేందుకే తాను సూరత్ నుంచి ఢిల్లీకి రెండు రోజుల్లో చేరుకున్నట్టు చెప్పాడు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంత్రి అమిత్ షాను కలవాలనుకుంటున్నట్టు చెప్పాడు. ప్రధాని ‘హర్ ఘర్ తిరంగా’ ప్రచారంతో స్ఫూర్తి పొందానన్న సిద్ధార్థ్.. ప్రధాని మోదీ, మంత్రి అమిత్ షా అపాయింట్‌మెంట్ కోరినట్టు తెలిపాడు.



Updated Date - 2022-08-15T02:45:42+05:30 IST