గుజరాత్‌ జోరు

ABN , First Publish Date - 2022-04-03T09:47:09+05:30 IST

గుజరాత్‌ టైటాన్స్‌ ఆల్‌రౌండ్‌ షోతో అదరగొడుతోంది. తొలి ఐపీఎల్‌ ఆడుతున్న ఈ జట్టు తమ ఆరంభ రెండు మ్యాచ్‌ల్లోనూ మెరిసింది.

గుజరాత్‌ జోరు

  • వరుసగా రెండో విజయం
  • రాణించిన గిల్‌ ఢిల్లీకి ఓటమి

పుణె: గుజరాత్‌ టైటాన్స్‌ ఆల్‌రౌండ్‌ షోతో అదరగొడుతోంది. తొలి ఐపీఎల్‌ ఆడుతున్న ఈ జట్టు తమ ఆరంభ రెండు మ్యాచ్‌ల్లోనూ మెరిసింది. గుజరాత్‌ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (46 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 84) అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా.. విజయం వైపు సాగుతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ను కీలక దశలో టైటాన్స్‌ బౌలర్లు దెబ్బతీశారు. దీంతో శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ 14 పరుగుల తేడాతో నెగ్గింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 171 పరుగులు చేసింది. హార్దిక్‌ పాండ్యా (31), మిల్లర్‌ (20 నాటౌట్‌) రాణించారు. ముస్తాఫిజుర్‌కు 3, ఖలీల్‌కు 2 వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్లకు 157 పరుగులు చేసి ఓడింది. పంత్‌ (43), లలిత్‌ యాదవ్‌ (25), పావెల్‌ (20) ఫర్వాలేదనింపిచారు. ఫెర్గూసన్‌కు నాలుగు, షమికి రెండు వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా ఫెర్గూసన్‌ నిలిచాడు. 


ఆరంభం నుంచే కట్టడి: ఛేదనలో ఢిల్లీ ఆరంభంలోనే తడబడింది. 34 పరుగులకే ఓపెపర్లు పృథ్వీ షా (10), సైఫర్ట్‌ (3), మన్‌దీ్‌ప (18) పెవిలియన్‌కు చేరారు. అప్పటికి పవర్‌ప్లే కూడా ముగియలేదు. ఈ దశలో పంత్‌, లలిత్‌ టైటాన్స్‌ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ బౌండరీలతో సమాధానమిచ్చారు. వీరి ఆటతో ఢిల్లీ విజయం వైపు సాగుతున్నట్టనిపించింది. కానీ ఢిల్లీ ఇన్నింగ్స్‌ సజావుగా సాగుతున్న దశలో టైటాన్స్‌ బౌలర్లు పైచేయి సాధించారు. ముందుగా లలిత్‌ రనౌట్‌ కావడంతో నాలుగో వికెట్‌కు 61 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. 15వ ఓవర్‌లో పంత్‌, అక్షర్‌ (8)ను ఫెర్గూసన్‌ అవుట్‌ చేయడంతో జట్టు కోలుకోలేకపోయింది. ధాటిగా ఆడుతున్న పావెల్‌, ఖలీల్‌ అహ్మద్‌(0)లను షమి ఒకే ఓవర్‌లో అవుట్‌ చేయడంతో ఢిల్లీ ఓటమి ఖరారైంది.


గిల్‌ అదుర్స్‌: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టైటాన్స్‌ ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ గిల్‌ ఆటే హైలైట్‌గా నిలిచింది. కళాత్మక షాట్లతో ఆకట్టుకున్న అతడికి కెప్టెన్‌ హార్దిక్‌ సహకరించాడు.   తొలి ఓవర్‌ మూడో బంతికే వేడ్‌ (1)ను ముస్తాఫిజుర్‌ అవుట్‌ చేశాడు. నిదానంగా ఆడిన విజయ్‌ శంకర్‌ (13) పవర్‌ప్లే ముగిశాక కుల్దీప్‌ ఓవర్‌లో బౌల్డయ్యాడు. ఈ దశలో గిల్‌కు హార్దిక్‌ జత కలవడంతో ఇన్నింగ్స్‌ కుదురుకుంది. ఇద్దరూ అడపాదడపా ఫోర్లు బాదుతూ పరుగులు సాధిస్తుండడంతో భారీ స్కోరు ఖాయమే అనిపించింది. కానీ మూడో వికెట్‌కు 65 పరుగులు జోడించాక 14వ ఓవర్‌లో హార్దిక్‌ వెనుదిరిగాడు. అటు 32 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసిన గిల్‌ మాత్రం 16వ ఓవర్‌లో రెండు సిక్సర్లతో మరింత జోరు పెంచాడు. సెంచరీ వైపు సాగుతున్న దశలో 18వ ఓవర్‌లో ఖలీల్‌కు గిల్‌ చిక్కడంతో వేగం తగ్గింది. ఆ తర్వాత మిల్లర్‌ (20 నాటౌట్‌), తెవాటియా (14) డెత్‌ ఓవర్లలో ఆశించిన మేర ఆడలేకపోయారు. ఆఖరి ఓవర్‌లో ముస్తాఫిజుర్‌.. తెవాటియా, అభినవ్‌ మనోహర్‌ (1) వికెట్లను తీసి 4 పరుగులే ఇచ్చాడు.  


గుజరాత్‌: వేడ్‌ (సి) పంత్‌ (బి) ముస్తాఫిజుర్‌ 1, గిల్‌ (సి) అక్షర్‌ (బి) ఖలీల్‌ 84, విజయ్‌ శంకర్‌ (బి) కుల్దీప్‌ 13, హార్దిక్‌ (సి) పావెల్‌ (బి) ఖలీల్‌ 31, మిల్లర్‌ (నాటౌట్‌) 20, తెవాటియా (సి) శార్దూల్‌ (బి) ముస్తాఫిజుర్‌ 14, అభినవ్‌ (సి) అక్షర్‌ (బి) ముస్తాఫిజుర్‌ 1, రషీద్‌ (నాటౌట్‌) 0, ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 20 ఓవర్లలో 171/6. వికెట్ల పతనం: 1-2, 2-44, 3-109, 4-145, 5-168, 6-170. బౌలింగ్‌: ముస్తాఫిజుర్‌ 4-0-23-3, శార్దూల్‌ ఠాకూర్‌ 4-0-42-0, ఖలీల్‌ అహ్మద్‌ 4-0-34-2, అక్షర్‌ పటేల్‌ 4-0-37-0; కుల్దీప్‌ యాదవ్‌ 4-0-32-1. 


ఢిల్లీ: పృథ్వీ షా (సి) విజయ్‌ శంకర్‌ (బి) ఫెర్గూసన్‌ 10, సైఫర్ట్‌ (సి) అభినవ్‌ (బి) హార్దిక్‌ 3, మన్‌దీ్‌ప (సి) వేడ్‌ (బి) ఫెర్గూసన్‌ 18, పంత్‌ (సి) అభినవ్‌ (బి) ఫెర్గూసన్‌ 43, లలిత్‌ (రనౌట్‌) 25, పావెల్‌ (ఎల్బీ) షమి 20, అక్షర్‌ (సి) వేడ్‌ (బి) ఫెర్గూసన్‌ 8, శార్దూల్‌ (ఎల్బీ) రషీద్‌ 2, కుల్దీప్‌ (నాటౌట్‌) 14, ఖలీల్‌ (సి) వేడ్‌ (బి) షమి 0, ముస్తాఫిజుర్‌ (నాటౌట్‌) 3, ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: 20 ఓవర్లలో 157/9. వికెట్ల పతనం: 1-8, 2-32, 3-34, 4-95, 5-118, 6-126, 7-134, 8-143, 9-143. బౌలింగ్‌: షమి 4-0-30-2, హార్దిక్‌ 4-0-22-1, ఫెర్గూసన్‌ 4-0-28-4, రషీద్‌ 4-0-30-1, ఆరోన్‌ 1-0-7-0, విజయ్‌ శంకర్‌ 1-0-14-0, తెవాటియా 1-0-13-0.



Updated Date - 2022-04-03T09:47:09+05:30 IST