Gujarat hooch tragedy: కల్తీ మద్యం తాగి 19 మంది మృతి

ABN , First Publish Date - 2022-07-26T15:54:22+05:30 IST

గుజరాత్(Gujarat) రాష్ట్రంలోని బొటాడ్‌లో విషాదం( tragedy) అలముకుంది...

Gujarat hooch tragedy: కల్తీ మద్యం తాగి 19 మంది మృతి

అహ్మదాబాద్ (గుజరాత్): గుజరాత్(Gujarat) రాష్ట్రంలోని బొటాడ్‌లో విషాదం (tragedy) అలముకుంది.బొటాడ్‌లో కల్తీ మద్యం తాగి 19 మంది మృత్యువాత(die) పడిన ఘటన గుజరాత్ రాష్ట్రంలో సంచలనం రేపింది.మంగళవారం నాటికి మరో 9 మంది మృత్యువాత పడడంతో నకిలీ దేశీయ మద్యం తాగి మరణించిన వారి సంఖ్య 19కి చేరుకుంది.  మృతులకు మద్యానికి బదులుగా రసాయనాలను(chemicals) విక్రయించారని ప్రాథమిక గుజరాత్ పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. చెప్పారు.ఆదివారం రాత్రి కెమికల్ తాగి అస్వస్థతకు గురయ్యారని గుజరాత్ పోలీసు వర్గాలు తెలిపాయి.బాధితులకు విషపూరిత మద్యంలో ఉండే మిథైల్‌ను ఎమోస్‌ అనే కంపెనీ సరఫరా చేసినట్లు సిట్ విచారణలో వెల్లడైంది. గోడౌన్ మేనేజర్ జయేష్ అకా రాజు తన బంధువు సంజయ్‌కు రూ.60 వేలకు 200 లీటర్ల మిథైల్‌ను సరఫరా చేశాడు.సంజయ్  అతని సహచరుడు పింటూ, మిథైల్ రసాయనాలతో నిండిన పౌచ్‌లను దేశంలో తయారు చేసిన మద్యం పేరుతో ప్రజలకు విక్రయించారు. 


కల్తీ రసాయనం తాగి మృత్యువాత

ప్రజలు దాన్ని తాగి  అనారోగ్యంతో మరణించారు.మొత్తం 600 లీటర్ల మిథైల్‌ను ఎమోస్ కంపెనీ సరఫరా చేసిందని, అందులో 450 లీటర్లను తాము స్వాధీనం చేసుకున్నామని పోలీసువర్గాలు తెలిపాయి.ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నివేదిక వచ్చిన తర్వాత పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులపై హత్యానేరం మోపుతామని పోలీసులు తెలిపారు.కల్తీ మద్యం తాగిన 40 మందికి పైగా ప్రజల పరిస్థితి విషమంగా ఉందని, వారు వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారని పోలీసులు చెప్పారు. ఎక్కువమంది బాధితులు భావ్‌నగర్‌లోని సర్ తక్త్‌సిన్హ్జీ ఆసుపత్రిలో ఉన్నారు. వీరంతా బొటాడ్ జిల్లా బర్వాలా తాలూకాలోని రోజిద్ గ్రామంతోపాటు చుట్టుపక్కల మరికొన్ని గ్రామాలకు చెందినవారని పోలీసుల వివరించారు.ఆదివారం రాత్రి రోజిద్ గ్రామంలో కల్తీ మద్యం తాగిన కొన్ని గంటల తర్వాత తన భర్త పరిస్థితి క్షీణించడం ప్రారంభించిందని చికిత్స పొందుతున్న బాధితుడి భార్య పేర్కొంది.


కల్తీ మద్యంపై దర్యాప్తునకు సిట్

ఈ ఘటనపై విచారణ జరిపి నకిలీ మద్యం విక్రయించే దొంగలను పట్టుకునేందుకు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ర్యాంక్ అధికారి ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (భావ్‌నగర్ రేంజ్) అశోక్ కుమార్ యాదవ్ తెలిపారు.ఇప్పటివరకు అక్రమ మద్యం వ్యాపారంలో పాల్గొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అక్రమ మద్యం వ్యాపారుల ప్రాంగణాల్లో దొరికిన అన్ని రసాయన పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెప్పారు.


కల్తీ మద్యం వ్యాపారులకు రాజకీయ రక్షణ: కేజ్రీవాల్

కల్తీ మద్యం వ్యాపారులకు  రాజకీయ రక్షణ ఉందని గుజరాత్ పర్యటనలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.  ఈ సంఘటన దురదృష్టకరమని పేర్కొంటూ, నిషేధం అమలులో ఉన్న గుజరాత్‌లో అక్రమ మద్యం పెద్ద మొత్తంలో అమ్ముడవుతుందని కేజ్రీవాల్ ఆరోపించారు.అక్రమ మద్యం బాగోతంపై దర్యాప్తు జరిపించి చర్యలు తీసుకోవాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. 


Updated Date - 2022-07-26T15:54:22+05:30 IST