గుజరాత్: శ్రీకృష్ణ జన్మాష్టమి, వినాయక చవితిపై సర్కారు కీలక నిర్ణయం!

ABN , First Publish Date - 2021-08-25T12:38:32+05:30 IST

త్వరలో రాబోతున్న శ్రీకృష్ణ జన్మాష్టమి, వినాయకచవితి ఉత్సవాలకు...

గుజరాత్: శ్రీకృష్ణ జన్మాష్టమి, వినాయక చవితిపై సర్కారు కీలక నిర్ణయం!

న్యూఢిల్లీ: త్వరలో రాబోతున్న శ్రీకృష్ణ జన్మాష్టమి, వినాయకచవితి ఉత్సవాలకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఈ నేపధ్యంలో గుజరాత్ ప్రభుత్వం ఈ ఉత్సవాలకు సంబంధించి ప్రత్యేక గైడ్‌లైన్స్ జారీ చేసింది. ప్రజలంతా ఈ నియమాలను తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం కోరింది. రాష్ట్రంలో భారీ ఎత్తున శ్రీకృష్ణ జన్మాష్టమి, గణేశ్ ఉత్సవాలు నిర్వహించే పట్టణాల్లో రాత్రి కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయించారు. 


ఉత్సవాలు నిర్వహించాల్సిన తీరుతెన్నులను చర్చించేందుకు సీఎం విజయ్ రూపాణీ అథ్యక్షతన జరిగిన సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. జన్మాష్టమి సందర్భంగా ఆగస్టు 30న రాత్రి కర్ఫ్యూ విధించనున్నారు. ఈ ఉత్సవాలకు 200కు మించి భక్తులు హాజరయ్యేందుకు అనుమతి లేదు. ఇక గణేశ్ ఉత్సవాల విషయానికొస్తే వినాయక విగ్రహం ఎత్తు విషయంలో నాలుగు అడుగుల పరిమతి పాటించాలని సూచించారు. గణేశ్ ఉత్సవాలు జరిగే సెప్టెంబరు 9-19 మధ్య కాలంలో మండపాలలో కేవలం హారతి, ప్రసాద వితరణ మాత్రమే చేయాలని  సూచించారు. పూజలు నిర్వహించే సమయంలో జనం గుమిగూడకుండా చూడాలని నిర్వాహకులకు సూచించారు. 

Updated Date - 2021-08-25T12:38:32+05:30 IST