పారిపోయిన ప్రేమ జంట తిరిగి వచ్చింది.. వారికి గ్రామస్తులు ఎలాంటి శిక్ష విధించారంటే..

ABN , First Publish Date - 2021-07-22T20:58:54+05:30 IST

గుజరాత్‌లోని ఓ గ్రామానికి చెందిన ప్రేమ జంట ఈ నెల 11న ఊరి నుంచి వెళ్లిపోయింది..

పారిపోయిన ప్రేమ జంట తిరిగి వచ్చింది.. వారికి గ్రామస్తులు ఎలాంటి శిక్ష విధించారంటే..

గుజరాత్‌లోని ఓ గ్రామానికి చెందిన ప్రేమ జంట ఈ నెల 11న ఊరి నుంచి వెళ్లిపోయింది.. తీవ్రంగా గాలించి వారిని కొందరు గ్రామస్తులు వెతికి పట్టుకున్నారు.. వారిని గ్రామానికి తీసుకొచ్చి దారుణమైన శిక్షను విధించారు.. వారిని ఓ చెట్టుకు కట్టేసి విచక్షణారహితంగా కొట్టారు.. ఈ వీడియో వైరల్ కావడంతో గ్రామానికి చెందిన 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 


చౌతౌదేపూర్‌లోని చిలియవంత్‌ గ్రామానికి చెందిన గిరిజన ప్రేమ జంట జులై 18న ఇంటినుంచి పారిపోయింది. వారి కోసం కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అన్వేషణ సాగించి ఎట్టకేలకు పట్టుకున్నారు. వారిద్దరినీ గ్రామానికి తీసుకొచ్చి ఓ చెట్టుకు కట్టేశారు. పెద్ద పెద్ద కర్రలతో వారిని చితకబాదారు. దెబ్బలు తాళలేక వాళ్లు హృదయవిదారకంగా కేకలు పెడుతున్నా వదల్లేదు. చుట్టూ మూగిన జనం కూడా వారిని ఆపలేదు. ఆ ఘటన మొత్తాన్ని స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది పోలీసుల దృష్టికి వెళ్లడంతో వారు రంగంలోకి దిగారు. బాధితురాలి స్టేట్‌మెంట్ తీసుకుని తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు. 

Updated Date - 2021-07-22T20:58:54+05:30 IST