గుజరాత్ రాబట్టిన మాస్క్‌ ఫైన్ తెలిస్తే షాక్ తప్పదు

ABN , First Publish Date - 2021-03-11T21:05:18+05:30 IST

కోవిడ్-19 మహమ్మారిని కట్టడి చేసేందుకు తీసుకోవలసిన జాగ్రత్తల్లో

గుజరాత్ రాబట్టిన మాస్క్‌ ఫైన్ తెలిస్తే షాక్ తప్పదు

గాంధీ నగర్ : కోవిడ్-19 మహమ్మారిని కట్టడి చేసేందుకు తీసుకోవలసిన జాగ్రత్తల్లో మాస్క్ ధరించడం ఒకటి. ప్రజలను చైతన్యపరిచేందుకు, తప్పనిసరిగా మాస్క్ ధరించేలా చేసేందుకు గుజరాత్ ప్రభుత్వం కఠిన చర్యలు అమలు చేసింది. మాస్క్ ధరించనివారికి జరిమానా విధించింది. అయినప్పటికీ కొందరు కోవిడ్-19 మార్గదర్శకాలను పాటించకుండా నిర్లక్ష్యం ప్రదర్శించారు. ఇటువంటివారి నుంచి 2020 ఏప్రిల్ నుంచి 2020 సెప్టెంబరు వరకు వసూలు చేసిన సొమ్ము రూ.168 కోట్లు. గుజరాత్ శాసన సభ బడ్జెట్ సమావేశాల్లో ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఈ వివరాలను వెల్లడించారు. 


మాస్క్ ధారణ నిబంధనను పాటించనివారి నుంచి 2020 అక్టోబరు నుంచి ఇప్పటి వరకు వసూలు చేసిన జరిమానా వివరాలను ప్రభుత్వం వెల్లడించలేదు. అయితే ఓ అంచనా ప్రకారం 2020 ఏప్రిల్ నుంచి 2021 ఫిబ్రవరి వరకు వీరి నుంచి జరిమానా రూపంలో వసూలు చేసిన సొమ్ము దాదాపు రూ.308 కోట్లు ఉండవచ్చునని తెలుస్తోంది. 


మాస్క్ నిబంధనను పాటించని 16,78,922 మంది నుంచి 2020 ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు రూ.168 కోట్లు వసూలు చేసినట్లు విజయ్ రూపానీ తెలిపారు. మొదట్లో రూ.200 జరిమానాగా వసూలు చేసినట్లు, ఆ తర్వాత దీనిని రూ.500కు, కొంత కాలం తర్వాత రూ.1,000కి పెంచినట్లు తెలిపారు. 


Updated Date - 2021-03-11T21:05:18+05:30 IST