ఆయుధాల రాకెట్ గుట్టును రట్టు చేసిన Anti Terror Squad

ABN , First Publish Date - 2022-05-06T18:28:36+05:30 IST

గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అక్రమ ఆయుధాల రాకెట్‌ గుట్టును ఛేదించింది....

ఆయుధాల రాకెట్ గుట్టును రట్టు చేసిన Anti Terror Squad

అహ్మదాబాద్: గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అక్రమ ఆయుధాల రాకెట్‌ గుట్టును ఛేదించింది. అక్రమ ఆయుధాల కేసులో నిందితులైన 24 మందిని ఏటీఎస్ అరెస్టు చేసింది. గుజరాత్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల నుంచి 54 దేశీయ తుపాకులను స్వాధీనం చేసుకుంది. గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్ర ప్రాంతం నుంచి ఎక్కువ తుపాకులను స్వాధీనం చేసుకున్నామని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.ఇద్దరు ప్రధాన నిందితులు దేవేంద్ర బోరియా, చంప్‌రాజ్ ఖచర్ గత రెండేళ్లలో సురేంద్రనగర్, రాజ్‌కోట్‌లతో సహా సౌరాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో 100 కంట్రీ మేడ్ పిస్టల్స్‌ను విక్రయించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఏటీఎస్ కు అందిన సమాచారం ఆధారంగా ఏటీఎస్ బృందం మే 3న అహ్మదాబాద్ నగరంలోని గీతా మందిర్ ప్రాంతం నుంచి సురేంద్రంగార్ నివాసితులైన బోరియా, ఖచర్‌లను పట్టుకున్నట్లు ఏటీఎస్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హర్ష్ ఉపాధ్యాయ తెలిపారు.


సౌరాష్ట్రలో 100 పిస్టల్స్ విక్రయించినట్లు నిందితులు అంగీకరించారు. నిందితులు ఒక్కో పిస్టల్‌ను 15,000 నుంచి 25వేల రూపాయల వరకు విక్రయించారని తేలింది. ఏటీఎస్ బృందాలు 24 గంటల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 22 మంది వ్యక్తులను పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి 50 పిస్టల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ ఆయుధాల నెట్‌వర్క్‌పై తదుపరి విచారణ కొనసాగుతోందని ఏటీఎస్ అధికారి తెలిపారు.


Read more