15 కిలోల చాక్లెట్‌తో 12 గంట‌ల్లో రామ‌మందిరం... ప్ర‌ధానికి ఇవ్వనున్న‌ మ‌హిళ‌!

ABN , First Publish Date - 2020-08-05T11:03:26+05:30 IST

అయోధ్యలో రామాలయ భూ ఆరాధనకు సన్నాహాలు పూర్తయ్యాయి. ఈరోజు భూమి పూజలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్య‌కు...

15 కిలోల చాక్లెట్‌తో 12 గంట‌ల్లో రామ‌మందిరం... ప్ర‌ధానికి ఇవ్వనున్న‌ మ‌హిళ‌!

అహ్మదాబాద్‌: అయోధ్యలో రామాలయ భూ ఆరాధనకు సన్నాహాలు పూర్తయ్యాయి. ఈరోజు భూమి పూజలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ  అయోధ్య‌కు రానున్నారు. ఇదిలావుండ‌గా గుజ‌రాత్‌లోని అహ్మ‌దాబాద్‌కు చెందిన రామ‌భ‌క్తురాలు  శిల్పాభ‌ట్‌ చాక్లెట్ రామాల‌యాన్ని రూపొందించారు.. వృత్తిరీత్యా చాక్లెట్ తయారీదారు అయిన శిల్ప‌ 15 కిలోల చాక్లెట్ వినియోగించి, రామాల‌య న‌మూనాను రూపొందించారు. ఈ ఆలయాన్ని రూపొందించేందుకు శిల్ప‌కు 12 గంటలు పట్టింది. ఆల‌యంలో చాక్లెట్ స్తంభాలు, గర్భగుడిని ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా మ‌ల‌చారు. కాగా ఈ ఆల‌య న‌మూనాను ప్రధాని నరేంద్ర మోదీకి కానుక‌గా ఇవ్వాలనుకుంటున్నానని శిల్పా భట్ చెప్పారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని సంకల్పశక్తి కారణంగా రామాలయ నిర్మాణానికి పునాది రాయి ప‌డ‌బోతోందన్నారు. తాను ఈ చాక్లెట్ రామాల‌యాన్ని ప్ర‌ధానికి అంద‌జేయాల‌నుకుంటున్నాన‌ని, అది కుద‌ర‌ని ప‌క్షంలో పిల్ల‌ల‌కు రామ ప్ర‌సాదంగా పంపిణీ చేస్తాన‌ని అన్నారు. శిల్ప గత నాలుగేళ్లుగా చాక్లెట్‌తో ఆక‌ర్ష‌ణీయ‌మైన ఆకృతుల‌ను చేస్తున్నారు. 

Updated Date - 2020-08-05T11:03:26+05:30 IST