ఆస్పత్రుల చట్టంపై త్వరలో మార్గదర్శకాలు

ABN , First Publish Date - 2022-01-25T07:20:58+05:30 IST

క్లినికల్‌ ఎస్టాబ్లి్‌షమెంట్స్‌ రిజిస్ర్టేషన్‌ అండ్‌ రెగ్యులేషన్‌ చట్టం అమలుకు త్వరలోనే

ఆస్పత్రుల చట్టంపై త్వరలో మార్గదర్శకాలు

 హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం


హైదరాబాద్‌, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): క్లినికల్‌ ఎస్టాబ్లి్‌షమెంట్స్‌ రిజిస్ర్టేషన్‌ అండ్‌ రెగ్యులేషన్‌ చట్టం అమలుకు త్వరలోనే నిబంధనలను రూపొందించి అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు నివేదించింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల నమోదు, వాటిపై నియంత్రణ, పర్యవేక్షణతోపాటు ఉత్తమ ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకునే ఉద్దేశంతో 2010లో క్లినికల్‌ ఎస్టాబ్లి్‌షమెంట్‌ చట్టానికి పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది. ఈ చట్టాన్ని అమలు చేయాలని 2017లో తెలంగాణ రాష్ట్రం నిర్ణయించింది. అయితే ఈ చట్టాన్ని రాష్ట్రం అమలుచేయడం లేదని, అవసరమైన నియమ నిబంధనలను రూపొందించలేదని పేర్కొంటూ 2020 మార్చిలో ఫోరం ఎగనెస్ట్‌ కరప్షన్‌ అనే స్వచ్ఛంద సంస్థ హైకోర్టును ఆశ్రయించింది.


తాజాగా ఈ పిటిషన్‌పై చీఫ్‌ జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్‌ అభినందన్‌కుమార్‌ షావిలి ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరు వర్గాల వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. మరో నాలుగువారాలు గడువిస్తున్నట్లు స్పష్టంచేసింది. ఈలోగా నిబంధనలు పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంటూ, తదుపరి విచారణను మార్చి నెలకు వాయిదావేసింది.


Updated Date - 2022-01-25T07:20:58+05:30 IST