Advertisement
Advertisement
Abn logo
Advertisement

పెళ్లికి అతిథులుగా వచ్చిన ఆ నలుగురు.. పెళ్లికూతురి గదిలోకి వెళ్లి ఏం చేశారంటే..

దేశ రాజధాని ఢిల్లీలో పెళ్లిళ్లు చాలా గొప్పగా జరుగుతుంటాయి. అక్కడ జరిగే వివాహ కార్యక్రమాలలో బంధువులు, అతిథులందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. ఇటీవల ఢిల్లీలో జరుగుతున్న పెళ్లిళ్లలో విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. కొందరు అతిథులుగా వచ్చి దోపిడీలు చేస్తున్నారు. పోలీసులకు గత కొంత కాలంగా పెళ్లిళ్లలో దొంగతనాలు జరుగుతున్నాయని ఫిర్యాదులందుతున్నాయి.


ఢిల్లీలోని అలీపూర్ ప్రాంతంలో నవంబర్ 30న ఒక పెళ్లిలో చాలా మంది అతిథులొచ్చారు. అందులో ఓ నలుగురు దొంగలు.. మంచి బట్టలు వేసుకొని పెళ్లి వేడుకలో కలిసిపోయారు. ఆ నలుగురిలో ఇద్దరు మహిళలు. వారు పెళ్లిలో వెళ్లగానే ముందుగా.. పెళ్లికూతురు గదిలో వెళ్లారు. అక్కడ ఆమె వేసుకున్న నగలను పరిశీలించారు. ఆ తరువాత పెళ్లిలో అతిథులు ఇచ్చే కానుకలవైపు కన్నేశారు. 


పెళ్లిలో వధూవరులు ఫొటోలకు పోజిలిస్తుండగా.. వెనుక ఒక టేబుల్‌పై పెద్ద బ్యాగులో డబ్బు, నగలున్నాయి. వాటిని పెళ్లికూతురు వదిన అక్కడ పెట్టి వధూవరులతో ఫొటో దిగడానికని వెళ్లింది. ఆమె తిరిగి చూసేసరికి ఆ బ్యాగు మాయమైంది. దీంతో పెళ్లిలో దొంగతనం జరిగిందని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫిర్యాదు అందిన వెంటనే సీసీటీవి వీడియోలను పరిశీలిస్తున్నారు. అందులో మహిళలు దొంగతనం చేస్తున్నట్టు కనపడింది. కానీ వారెవరో తమకు తెలీదని అందరూ అంటున్నారు.


సీసీటీవి వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి.. ఆ దొంగల కోసం గాలిస్తున్నారు.

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement