‘అతిథి’ అమ్మకాలపై కమిషనర్‌కు ఫిర్యాదు?

ABN , First Publish Date - 2021-12-04T06:54:29+05:30 IST

‘అతిథి’ అమ్మకాలపై కమిషనర్‌కు ఫిర్యాదు?

‘అతిథి’ అమ్మకాలపై కమిషనర్‌కు ఫిర్యాదు?

జాబితా ప్రదర్శించకపోవడంపై అభ్యర్థుల అనుమానాలు

నియామక ప్రక్రియ పారదర్శకం- ఆర్సీవో

ఖమ్మం, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాలోని ఓ శాఖకు చెందిన గురుకులాల్లో అతిథి అధ్యాపకపోస్టుల నియామాకాల్లో పలు అక్రమాలు జరిగా యన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తమకు నచ్చిన వారికే పోస్టింగ్‌ వచ్చేలా డెమోల్లో అక్రమాలకు పాల్పడ్డారని, ఈ క్రమంలో భారీమొత్తంలో వసూళ్లకు పాల్పడ్డారంటూ పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. కాగా ఆయా ఆరోపణలు వచ్చి న నేపథ్యంలో తమకు అన్యాయం జరిగిందని భావించిన కొందరు అభ్యర్థులు సంబంధిత శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. అయితే ఆయా నియామకాలకు సంబంధించి పోస్టుల వారీగా దర ఖాస్తులు తీసుకున్న సమయంలో అభ్యర్థుల నుంచి ఎక్కడి పోస్టుకు దరఖాస్తు చేసుకున్నారో లాంటి అంశాలను తీసుకోలేదని, పోస్టులు వారీగా వచ్చిన దర ఖాస్తులు.. వచ్చిన వెయిటేజీ మార్కులను ఎక్కడా నోటీసు బోర్డులో ప్రదర్శించక పోవడంతో పలువురు అభ్యర్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దానిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపేలా చర్యలు తీసుకోవాలని పలువురు అభ్యర్థులు కమి షనర్‌ను కోరనున్నట్టు తెలుస్తోంది.కాగా అతిథి అధ్యాపకుల నియామక ప్రక్రియ లో జరిగిన అవకతవకలపై మూడు రోజులుగా ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురిస్తున్న వరు స కథనాలపై ఆ శాఖ ఆర్సీవో జ్యోతి స్పందించారు. నియామకాల కోసం పత్రికా ప్రకటన ఇచ్చినట్టు, ఎంపిక ప్రక్రియకోసం సొసైటీవారు రాష్ట్రంలోని వివిధ జిల్లా లకు చెందిన సబ్జెక్ట్‌ కో ఆర్డినేటర్స్‌, రిసోర్స్‌పర్సన్‌ను తీసుకున్నట్టు తెలిపారు. వారు జూమ్‌ యాప్‌ద్వారా లింక్‌ను పంపి సంబంధిత అభ్యర్థికి డెమో నిర్వహిం చినట్టు పేర్కొన్నారు. మెరిట్‌ లిస్టులోని ఖాళీల ఆధారంగా ఎంపిక చేసి నట్టు తెలిపారు. మెరిట్‌ లిస్టులో ఉన్నా దూరాభారం, వ్యక్తిగత కారణాల వల్ల అసక్తి చూపనిపక్షంలో వారిని మినహాయించి తదుపరి మెరిట్‌ లిస్టులో ఉన్న ప్రతిభా వంతులను ఎంపిక చేసినట్టు తెలిపారు. నియామక ప్రక్రియపై ఏదైనా సందేహ ముంటే సంబంధిత కార్యాలయంలో నివృత్తి చేసుకోవచ్చని ఆమె తెలిపారు. 

Updated Date - 2021-12-04T06:54:29+05:30 IST